Header Banner

సైలెంట్ స్టార్ ‘ప్రేమదేశం’ హీరో.. కానీ ఆయన అక్క మాత్రం తెలుగులో టాప్ హీరోయిన్!

  Wed Jun 11, 2025 18:51        Cinemas

వినీత్.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తు పట్టక పోవచ్చు కానీ.. ప్రేమదేశం హీరో అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా వచ్చి 29 ఏళ్లు అయింది కానీ.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం. ఇక ఈ సినిమాతో వినీత్‌కు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోస్ట్ బిజీయెస్ట్ హీరో అయిపోయాడు. ఒక్క తమిళనాటే కాదు తెలుగులోనూ తిరుగులేని హిట్లు కొట్టాడు. నిజానికి ప్రేమదేశం సినిమా కంటే ముందే వినీత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 1993లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన 'సరిగమలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు వినీత్. రంభ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత ఆరో ప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వరప్రసాద్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపాడు. హీరోగానే కాదు.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేశాడు.

ఇది కూడా చదవండి: పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు! 

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ తమ్ముడిగా నటించాడు. ఆ తర్వాత అమ్మాయి కోసం, లాహిరి లాహిరి లాహిరిలో, నీ ప్రేమకై ఇలా పలు సినిమాల్లో నటించాడు. ఇక చివరగా.. నితిన్ హీరోగా నటించిన రంగ్‌దే సినిమాలో నటించాడు. ఇక ఇదిలా ఉంటే.. వినీత్ కజిన్ సిస్టర్ కూడా తెలుగులో తోపు హీరోయిన్ అని మీకు తెలుసా? అవును ఆమె మరెవరో కాదు శోభన. 90వ దశకంలో శోభన పేరు సంచలనం. అసలు ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. అప్పట్లో ఈలలు, గోలలతో థియేటర్‌లు మార్మోగిపోయేవి. కేవలం పోస్టర్‌పై శోభన కనిపిస్తే చాలు.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకులు ఎందరో. దాదాపు దక్షిణాదిన స్టార్ హీరోలందరితో కలిసి శోభన సినిమాలు చేసింది. అంతేకాదు అప్పట్లో చాలా మంది హీరోలు.. తమ సినిమాల్లో హీరోయిన్‌గా శోభన అయితే బావుండు అనుకునే వారట. వన్నెతరగని అందంతో పాటు నటన, నాట్యం ఇలా సకలకళా వల్లభురాలిగా శోభన ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆరు భాషల్లో దాదాపు 230కి పైగా సినిమాల్లో శోభన నటించింది.

ఇది కూడా చదవండి: 12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా చాలా విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. 1982లో వచ్చిన భక్త ధృవ మార్కాండేయ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభన. ఆ తర్వాత విక్రమ్, మువ్వ గోపాలుడు, త్రిమూర్తులు, రుద్రవీణ, అభినందన, నారి నారి నడుమ మురారి, నేటి సిద్ధార్థ, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ అల్లుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ.. అనతికాలంలోనే అగ్ర కథానాయికగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఇక మోహన్ బాబుతో కలిసి నటించిన 'గేమ్' సినిమా తర్వాత.. దాదాపు 18 ఏళ్లు గ్యాప్ తీసుకుని ప్రభాస్‌తో కలిసి కల్కీ2898AD సినిమాలో నటించింది. ఈ సినిమాలో మరియమ్ అనే కీలక రోల్‌లో నటించింది. గతేడాది రిలీజైన ఈ సినిమా రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

  

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

 ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

  

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #vinith #hero #sister #premadesam #movie #cinema #heroine #telugu